కోడుమూరు: వెంకటగిరిలో ఉల్లి పంట తొలగించి పప్పుచెనగా జొన్న విత్తనం వేసిన ఓ రైతు
కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామంలో ఓ రైతు ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను దున్నేసి జొన్న, పప్పుశనగగా విత్తనం వేసుకున్నాడు. రైతు తెలిపిన వివరాలు ఇవి. గ్రామానికి చెందిన గిడ్డయ్య అనే రైతు 13 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. ఎకరాకు రూ .60 వేల చొప్పున ఖర్చు అయింది. ఇప్పుడు కోత, గ్రేడింగ్, రవాణా ఖర్చులకు మరో రూ.20 వేలు అవుతుంది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసేదేమి లేక పంటను దున్నేశాడు. గ్రామంలో మరికొందరు రైతులు ఇదే దారి పట్టారు.