ఆచంట: సోమరాజు ఇల్లిందలపర్రులో అత్త, కోడలిని తాడుతో కట్టి, నోటిలో గుడ్డ పెట్టి బెదిరించి 48 కాసుల బంగారం నగదు దొంగలించిన దొంగలు
పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపర్రు గ్రామానికి చెందిన కర్రి బ్రహ్మానంద రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అత్త, కోడలిని తాడుతో కట్టి, నోటిలో గుడ్డ పెట్టి కత్తులతో బెదిరించి 48 కాసుల బంగారం, రూ.1,18,000 నగదు, రెండు ఫోన్లు అపహరించారు. సమాచారం అందుకున్న పెనుమంట్ర SI కేసు నమోదు చేయగా, పశ్చిమ గోదావరి జిల్లా SP ఆదేశాలతో నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్ సంఘటన స్థలాన్ని బుధవారం సాయంకాలం 4 గంటలకు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.