సంగారెడ్డి: ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చూస్తే ఊరుకోం : పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సురేష్
ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చూస్తుందని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సురేష్ ఆరోపించారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద గురువారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థులతో కలిసి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పిడిఎస్యు నాయకులు పాల్గొన్నారు.