శెట్టివీడు గ్రామ సమీపంలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా 15 మందికి గాయాలు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామ సమీపంలో రాత్రి ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించ బోయి పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 15 మంది గాయపడ్డారు, గొడుగునూరు గ్రామస్తులు దువ్వూరు మండలం నారాయణ పల్లె గ్రామంలో వివాహ కార్యక్రమానికి ట్రాక్టర్లో సుమారు 30 మంది వెళ్తుండగా మోటార్ బైక్ ను తప్పించిపోయి అదుపుతప్పి బోల్తా పడింది క్షతగాత్రులను చాగలమర్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు, చాగలమర్రి ఎస్సై ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు