ఒంగోలు అర్బన్: ఒంగోలులో 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దుకాణాలు కూల్చివేత, బాలినేని వద్దకు వెళ్లానని కూల్చి వేశారని ఆరోపిస్తున్న మహిళ
Ongole Urban, Prakasam | May 27, 2026
ఒంగోలు పట్టణంలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న తన షాపులను అధికారులు కూల్చివేశారని మరియమ్మ అనే మహిళ ఆరోపించారు. కోర్టులో వివాదం ఉన్నప్పటికీ, అధికారులు అత్యుత్సాహంతో తన దుకాణాలను ధ్వంసం చేశారని ఆమె వాపోయారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్తున్నానని చెప్పినందుకే ఇలా చేశారని ఓ మహిళా కార్యకర్త అన్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.