ఆళ్లగడ్డ: ఏపీలో పెట్రోల్ డీజిల్ కటకట.. చంద్రబాబు పాలన పై : వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఫైర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా కిషోర్ రెడ్డి స్వగృహం లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు,చంద్రబాబు నాయుడి పాలనలో గత ఆరు నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క యూరియా కోసం రైతులు, మరోపక్క గ్యాస్, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం సామాన్యులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. డీజిల్ లేక ప్రొద్దుటూరు–ఆళ్లగడ్డ మధ్య ప్రైవేట్ బస్సులు ఆగిపోతున్న భయ