వాంకిడి: రక్తదాన చేయండి ప్రాణ దాతలుగా నిలవండి: ఆసిఫాబాద్ DFO నీరజ్ కుమార్
రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవండి అని ASF, DFO నీరజ్ కుమార్ అన్నారు. శుక్రవారం ASF జిల్లా అటవీ కార్యాలయంలో ఏర్పాటు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్యంగా ఉన్న 18-65 ఏళ్ల మధ్య వయస్సు వారంతా రక్తదానం చేయొచ్చని, తద్వారా తలసేమియా బాధితులతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లవుతుందని తెలిపారు. ఈ శిబిరంలో 60 మంది అటవీ ఉద్యోగులు రక్తదానం చేశారు.