ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న అరకులోయ MPP- ప్రభుత్వ ఆసుపత్రిలపై నమ్మకం పెంచాలన్న అరకు MLA మత్స్యలింగం
అరకులోయ ఎంపీపీ రంజపల్లి ఉషారాణి అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో చేరి పురుడు పోసుకొని పండంటి మగ బిడ్డను జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రేమత్స్యలింగం అరకు ఏరియా ఆసుపత్రికి చేరుకొని తల్లీ బిడ్డల యోగ క్షేమాలు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు.