నంద్యాల అర్బన్: నంద్యాలలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
Nandyal Urban, Nandyal | May 7, 2026
నంద్యాలలోని కేఎన్ఎం పురపాలక పాఠశాల ఆవరణలో కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా శిబిరం గురువారం ప్రారంభమైంది. సంస్థ ప్రతినిధులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవికృష్ణ, ప్రధానోపాధ్యా యులు అసదుల్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని వారు తెలిపారు. శిబిరం నుంచి విద్యార్థులు క్రమశిక్షణ, నైపుణ్యాలు నేర్చుకోవాలని వారు సూచించారు.