కడప: దసరా సెలవులు ఇవ్వకుండా ప్రైవేట్ టీచర్లను మానసికక్షోభకు గురి చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: డివైఎఫ్ఐ
Kadapa, YSR | Sep 24, 2025 జిల్లాలో ప్రైవేటు టీచర్లకు దసరా సెలవులు ఇవ్వకుండా వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్న ప్రైవేటు,కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు.బుధవారం నాడు ఆర్జేడీ కార్యాలయం ఏవో కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లను దసరా సెలవులలో తప్పకుండా రావాలని బాలంతం చేస్తున్నారని రాకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు.కడప లో చైతన్య,నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు వర్క్ షాప్ పేరుతో ఊరి చివర విద్యా సంస్థల బ్రాంచ్ లలో వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారని అన్నారు.