వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరంలో పంటు ప్రయాణాలను నిలిపేయాలని సూచించిన ఆర్డీఓ అఖిల
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కోటిపల్లి గౌతమి గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటు ప్రయాణాలు నిలిపివేశారు. గోదావరి నది మధ్యలో గల కచ్చా రహదారికి గండి పడింది. విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి కోటిపలి రేవులో పంటు ప్రయాణాలు నిలిపి వేయాలని ఆదేశించారు.