నంద్యాల అర్బన్: నంద్యాలలో జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
నంద్యాలలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 'సాప్-2026' లీగ్ జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ రవికృష్ణ ఈ పోటీలను ప్రారంభించినట్లు అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈనెల 28 నుంచి 30 వరకు అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.