ఆత్మకూరు పట్టణంలో సందడి చేసిన మిరా ఈ సినిమా హీరోయిన్ రితిక నాయక్. హీరోయిన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డ జనం
ప్రముఖ తెలుగు సినీ హీరోయిన్ ఇటీవల విడుదలైన మిరాయి తెలుగు చలనచిత్ర హీరోయిన్ రితికా నాయక్ నంద్యాల జిల్లా ఆత్మకూరు లో సందడి చేసింది. ఓ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి హీరోయిన్ ఆత్మకూరు కు వచ్చారు. హీరోయిన్ రాకతో కర్నూల్ గుంటూరుకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి అభిమానులతో కిక్కిరిసింది. షోరూం ప్రారంభోత్సవానికి లోపలికి వెళ్లేందుకు అభిమానుల అతిత్సాహంతో లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులకు గురైంది ఎట్టకేలకు జ్యోతి ప్రజ్వలనతో స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా, హీరోయిన్ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు ప్రజలు తాను నటించిన సినిమాలను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.