తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి: పెదకూరపాడులో మండల అభివృద్ధి అధికారిణి మల్లీశ్వరి
పెదకూరపాడులో తాగునీటి చెరువును మండల అభివృద్ధి అధికారిణి మల్లీశ్వరి సోమవారం పరిశీలించారు. సాగర్ జలాలను ట్రాక్టర్ల ద్వారా, ఇంజిన్ల ద్వారా తాగునీటి చెరువును నింపడాన్ని తనిఖీ చేశారు. వేసవి తాపానికి తాగునీటికి ఇబ్బంది ఉండకూడదని, అందుకోసమే మంచినీటిని ట్రాక్టర్ల ద్వారా, ఇంజిన్ల ద్వారా మంచినీటి చెరువును నింపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.