బనగానపల్లె: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ : బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పింఛను సకాలంలో అందేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం బనగానపల్లెలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నామని తెలిపారు.