తాడిపత్రి: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన పంట అన్నదాతలను ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్
అనంతపురం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు వర్షార్పణం అయ్యాయి. యాడికి మండలంలో రైతులు మొక్కజొన్న పంట సాగు చేసి కోత కోసి అరబెట్టుకున్న సమయంలో వర్షం పడటంతో తడిచిపోయి మొలకలు వచ్చాయి. వేములపాడు, కొట్టాలపల్లికి చెందిన నాగాశేషు, జగదీష్ రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.