బనగానపల్లె: బనగానపల్లెలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి మహిళా బంకు కూల్చివేత, ఆర్టీసీ అధికారులపై సిపిఐ ఫైర్
నంద్యాల జిల్లా బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్డు వద్ద వెంకట లక్ష్మమ్మ అనే పేద మహిళ పెట్టుకున్న బంకులు ఆర్టీసీ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బంకును ధ్వంసం చేసి సామాగ్రి మీ కాల్వ వద్ద వద్ద పడేశారని బాధితురాలు సిపిఐ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆర్టీసీ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బస్టాండ్ ఆవరణంలో బంకును పెట్టుకోవడం వలన పోలీసుల సమక్షంలో తొలగించామని తెలిపారు