సంజామల మండలంలో పశుగ్రాసానికి భారీ గిరాకీ
సంజామలలో పశుగ్రాసానికి భారీ డిమాండ్ ఏర్పడింది. మండల వ్యాప్తంగా దాదాపు 15 వేల ఎకరాల్లో సాగైన ఎండకారు వరి కోతలు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో పొలాల్లో నిల్వ ఉన్న వరిగడ్డిని కొనుగోలు చేసేందుకు అనంతపురం జిల్లా రైతులు పెద్ద ఎత్తున సంజామలకు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డి ధర సుమారు రూ. 12 వేల వరకు పలుకుతుండటంతో స్థానిక రైతులకు లాభసాటిగా మారింది.