వేములవాడ: మూడో బ్రిడ్జి పనులు ప్రారంభం..వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ ఏమన్నారో తెలుసా..!?
గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ మూల వాగుపై నిర్మిస్తున్న మూడవ బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి భక్తులతో పాటు స్థానిక ప్రజలు ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మూల వాగుపై నిర్మాణ దశలోనే నిలిచిపోయిన మూడో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ బ్రిడ్జ్ ఈ ప్రభుత్వంలోనైనా కంప్లీట్ అవుతుందో లేదో అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. దీనిపై వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో త్వరలోనే పూర్తి పూర్తిచేసి భక్తుల,స్థానిక ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామన్నారు.