అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని అంకంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం డివిజనల్ స్థాయి జూడో పోటీలు పోటాపోటీగా సాగాయి. కళ్యాణదుర్గం డివిజనల్ పరిధిలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు జూడో పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను ఎంఈఓ-2 హరికృష్ణ,పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులతో కలిసి ప్రారంభించారు. పోటాపోటీగా సాగిన జూడో బాలుర విభాగం పోటీల్లో విజేతలుగా భరత్ నాయక్, మల్లికార్జున, హిమాయత్, వినయ్, రిషి నాయక్, అస్లాం భాష, మహంతిష్, భరత్ లు వివిధ విభాగాల్లో స్వర్ణ పథకాలు సాధించారని పాఠశాల హెచ్ఎం పేర్కొన్నారు.