ఉరవకొండ: జీడిపల్లి గ్రామంలోని కాలనీల్లో ఉబికి వస్తున్న ఊట నీటిని పరిశీలించిన కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ క్రింది భాగాన ఉన్న జీడిపల్లి గ్రామాన్ని మంగళవారం మధ్యాహ్నం కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు పరిశీలించారు. గ్రామంలోని కాలనీల్లో ఇళ్ల గోడల నుండి ప్రధాన రహదారుల నుండి ఉబికి వస్తున్న నీటిని ఆర్డిఓ మండల రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామానికి వచ్చిన ఆర్డీవోకు గ్రామస్తులు తాము ఊట నీటితో నిత్యం అవస్థలు పడుచున్నామని రాత్రులు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో యూనిట్ కు పది లక్షలను త్వరితగతిన అందించాలని గ్రామస్తులు కోరారు.