కర్నూలు: మంత్రి లోకేష్ నాయకత్వాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించింది : కర్నూల్ కూడా చైర్మన్ సోమి శెట్టి
గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసి, పరిశ్రమలు, ఉద్యోగాలు తగ్గించిందని కర్నూల్ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం అన్నారు. నరకాసురుడిలా ప్రజలను పీడించిన జగన్ను ఓటు ఆయుధంతో ప్రజలు తరిమేయడం నిజమైన దీపావళి అన్నారు.నారా లోకేష్ నాయకత్వాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించిందని, ఆయన మేధస్సు, వాక్చాతుర్యం పార్టీకి బలం తెస్తోందని తెలిపారు.కూటమి ప్రభుత్వం 16 నెలల్లో లక్ష కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రతి నెల 1న పింఛన్లు, రూ.5కు అన్న క్యాంటీన్లు, దీపం 2.0లో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి