ఒంగోలు అర్బన్: రేపు ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 12, 2026
ఏప్రిల్ 13 సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు మీడియాకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించినట్లయితే కలెక్టర్ రాజాబాబు వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని కలెక్టర్ కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.