అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తన కూతురు సౌమ్యను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి భార్య నుంచి తన కూతుర్ని రక్షించాలని తండ్రి మల్లు దొర కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. శరభవరం గ్రామ సచివాలయంలో సౌమ్య అనే తన కూతురు పనిచేస్తుందని, కొందరు వ్యక్తులు కారులో ఎక్కించుకుని బలవంతంగా తీసుకువెళ్లారని తెలిపారు. వారి బారి నుంచి తన కూతురిని రక్షించి అప్పగించాలని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలను కోరారు.