రాయపర్తిలో ఉద్రిక్తతకు దారి తీసిన యూరియా కోసం రైతులు చేపట్టిన నిరసన
వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉదయం నుండి రైతులు యూరియా కోసం లైన్లో వేచి ఉండి యూరియా దొరకకపోవడంతో రోడ్డుపైకి చేరుకొని నిరసన దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఉదయం 11:30 గంటలకు అక్కడికి చేరుకొని రైతుల దీక్షకు మద్దతు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని గత ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే రైతుల కోసం యూరియాను తీసుకొచ్చి పెట్టేదని ఆయన అన్నారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసి రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు పెరగడంతో ఆయనను వర్ధన్నపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.