జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో నాయకులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు .కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.