గుంతకల్లు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం, మండలంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండలో నైరుతి రెడ్డి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోందని వాటిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అడ్డుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని అయ్యవారిపల్లి, కదిరిపల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. గురువారం జరిగిన కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.