ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 18, 2026
వచ్చిన అర్జీలు అన్నిటిని పరిష్కరిస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కారక వేదిక మీకోసం కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించి త్వరగా ముగించే అంశంపై కలెక్టర్ ప్రజలకు పలు అంశాలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.