పాములపాడు గ్రామ శివారులోని భవనాశవాగులో గల్లంతైన నాగేశ్వరరావు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన NDRF బృందాలు
మండల కేంద్రమైన పాములపాడు గ్రామ శివారులోని, భవనాశి వాగ తుఫాన్ తాకిడికి ఉధృతంగా ప్రవహిస్తుంది.అయితే నాగంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు,అనే వ్యక్తులు పాములపాడుకు వచ్చి తిరిగి వెళుతుండగా భవనాశి వాగులో బైక్ పై దాటుతున్నగా ఆ ఉద్రితి దాటికి వారు ప్రయాణిస్తున్న బైకు ఒకసారిగా వాగులోకి కొట్టుకుపోయింది, దీంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు,అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వెంకటేశ్వర్లు రక్షించగా, నాగేశ్వరరావు వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు, అతని కోసం గురువారం ఉదయం నుంచి ఎన్టీఆర్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు ,ఇంకా అతని ఆచూకీ లభించలేదు,