డోన్: డోన్ సమీపంలో ఓ బస్సులో 20 కేజీల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు
Dhone, Nandyal | Apr 19, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి సమీపంలోని డాబా వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 20 కేజీల వెండి చోరీ అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వ్యాపారి మధురై నుంచి హైదరాబాద్కు వెండి తీసుకొని శనివారం బయలుదేరాడు. టిఫిన్ కోసం బస్సును డాబా వద్ద ఆపగా గుర్తుతెలియని వ్యక్తులు అందులోకి వెళ్లి 20 కేజీల వెండిని దొంగలించారని వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.