డోన్: నంద్యాల లో లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సహాయం
Dhone, Nandyal | Jun 13, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల వనితా క్లబ్ సెక్రటరీ భీమిశెట్టి శారద ఈ నెల 10వ తేదీన నంద్యాలలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. ఆమె కుటుంబానికి వాసవి క్లబ్, వనితా క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ నాగశైలజ, వనితా క్లబ్ అధ్యక్షురాలు గీతా మాధురి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.1.11 లక్షల నగదు అందజేశారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సూర్య బల్లాన్ని తెలిపారు.