పటాన్చెరు: అగ్ని ప్రమాదాలు పై అప్రమత్తంగా ఉండాలి : సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
పాశమైలారంలో అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ శాఖల సమన్వయంతో పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదాల నివారణ, రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల సమయంలో సిబ్బంది సురక్షితంగా బయటపడే మార్గాలు, తక్షణ రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.