కోయిల్ కొండ: ఈ నెల 20 వరకు భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడి
భూభారతి ద్వారా అన్ని మండలాల,గ్రామాల్లో ఈ నెల 20 వరకు భూసమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుజిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.బుధవారం కోయిల్ కొండ మండలం చంద్రాస్ పల్లి గ్రామం లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై దరఖాస్తులను పరిశీలించారు.అనంతరం చంద్రాస్ పల్లి గ్రామంలో పల్లె దవాఖాన ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు పల్లె దవాఖాన లో పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నవి అని డాక్టర్,సిబ్బందిని అడిగారు ఐదు గ్రామాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీ లు ఎంత మంది నమోదు అయ్యారు, ఎంత మంది డెలివరీ కి ఉన్నారు