గుంటూరు: త్రైమాసికా తనిఖిలలో భాగంగా కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
Guntur, Guntur | Sep 22, 2025 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసికా తనిఖిలలో భాగంగా సోమవారము ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేసి గోడౌన్ నందు గల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. సిసిటివి పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు.