పటాన్చెరు: అవసరాల్లో ఉన్నవారికి సీఎం సహాయ నిధి ఆశాకిరణం, MLA మహిపాల్ రెడ్డి చేతులమీదుగా చెక్కుల పంపిణీ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు డివిజన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని 19 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ₹7,22,500 విలువైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, తదితరులు హాజరయ్యారు.