జహీరాబాద్: దిగ్వాల్ వద్ద బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, వ్యక్తికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జహీరాబాద్ నుండి లింగంపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దిగ్వాల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న బైకును ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న పాండు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన స్థానికులు క్షతగాత్రుని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.