రాజేంద్రనగర్: అబ్దుల్లా పూర్ మెట్ వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హోం గార్డ్
స్మగ్లర్లతో చేయి కలిపి గంజాయిని తరలిస్తూ హోంగార్డ్ నీలాంబరి మిల్కా పోలీసులకు పట్టుబడ్డాడు. ఒడిశా నుంచి 15.33 కేజీల గంజాయిని HYDకు తరలిస్తున్నాడన్న సమాచారంతో STF టీం సిబ్బంది అబ్దుల్లాపూర్మెట్ వద్ద తనిఖీలు నిర్వహించి కారును పట్టుకున్నారు. కారు డిక్కీలో స్టెఫీనీ టైరును తీసేసి అందులో ఉన్న టైర్ డెస్క్ నాలుగు గంజాయి ప్యాకెట్లు దాచినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు.