పటాన్చెరు: డివిజన్ పరిధిలోని యాదవ సంఘం శ్మశాన వాటికలో నూతన సీసీ ప్లాట్ఫారం నిర్మాణ పనుల ప్రారంభం
పటాన్ చెరు డివిజన్ పరిధిలోని యాదవ సంఘం శ్మశాన వాటికలో నూతన సీసీ ప్లాట్ఫారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. GHMC రూ.40 లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు. మంగళవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎత్తుపల్లాలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.