డోన్: బేతంచర్ల మండలంలో నిలిచిపోయిన రహదారి పనులు ప్రారంభించాలని అధికారులను కోరుతున్న ప్రజలు
Dhone, Nandyal | Jun 17, 2026 నంద్యాల జిల్లా మండల పరిధిలోని కనుమకింది కొట్టాల రహదారి పనులను ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బేతంచర్ల నుంచి కనుమ కింది కొట్టాల గ్రామానికి3.35 కోట్ల నిధులు మంజూరు కావడంతో గత వైసీపీ హయాంలో పనులు ప్రారంభించారు. ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి రహదారి పనులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం కురిసిన వర్షాలతో రహదారి బురదమయంగా మారింది.