అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు శివాలయాల్లో సోమవారం కార్తీక మాస చివరి సోమవారం పురస్కరించుకుని కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప ఎర్రగుడి గ్రామాల్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ మంజునాథ స్వామి ఆలయాల్లో సోమవారం రాత్రి 7.30 గంటలకు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో మూల విరాట్ విగ్రహాలకు పంచామృత అభిషేకాలను నిర్వహించిన అనంతరం దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు తదనంతరం అన్నదాన కార్యక్రమాలను సేవా కమిటీ సభ్యులు దాతలతో కలిసి నిర్వహించారు.