ఇబ్రహీంపట్నం: 4G నుంచి సిమ్‌ను 5G గా మార్చుతామంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని వీడియో విడుదల చేసిన సైబరాబాద్ పోలీసులు
4G నుంచి 5G సిమ్ గా మార్చుతామంటూ వినియోదారులకు మోసం చేస్తున్నారని సైబరాబాద్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. నిందితులు లింకును పంపగానే మనం వాటిని ఓపెన్ చేయగానే మన వ్యక్తిగత బ్యాంక్ సమాచారాన్ని కోల్పోతున్నామని అన్నారు. అందువల్ల సిమ్ము మార్పుకు అధికార చానల్స్ మాత్రమే ఉపయోగించాలని ఫైబర్ నేరాల నుంచి రక్షించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.