నారాయణ్‌ఖేడ్: సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ధర్నా చేస్తాం : కంగ్టి లో brs పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సంజీవ్ పాటిల్
ఖరీఫ్ సీజన్లో సోయా పంట పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కంగ్టి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ పాటిల్ ఆరోపించారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ మండలంలో సోయా కొనుగోలు కేంద్రం ప్రభుత్వం అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.