గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రానైట్లు మూసివేత... నిర్వహణ పెనుభారంగా మారిందన్న యజమానులు.... మార్టూరులో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గ్రానైట్ యజమానుల సంఘం అధ్యక్షులు సురేష్ ప్రకటించారు. బాపట్ల జిల్లా, మార్టూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు చెప్పారు. గిట్టుబాటు ధర లేక జీతాలు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.