ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 517 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించాం: కలెక్టర్ హిమాన్షు శుక్లా
సాధారణ ఎన్నికలు-2024 నేపద్యంలో పోలింగ్ ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులు సమక్షంలో నిర్వహించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 517 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు., మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సూక్ష్మ పరిశీలకుల ర్యాoమైజేషన్ ప్రక్రియ సాధారణ ఎన్నికల పరిశీలకులు పరదీప్ కుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయింపులు జరిపారు..