మియాపూర్లోని పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్లే నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నాలాను శ్రీ చైతన్య కళాశాల తమ క్రీడా మైదానానికి అడ్డుగా మట్టి నింపి కబ్జా చేసినట్లు నిర్ధారించారు. దాదాపు 500 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు గల నాలా మార్గాన్ని అక్రమంగా మళ్లించినట్లు గుర్తించారు. ఉదయం నుంచి జేసీబీలతో అడ్డుగా వేసిన మట్టిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు.