ఈనెల 19వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం వద్ద వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన: మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు
రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూస్తుందని, దీనిని వైసిపి పూర్తిగా వ్యతిరేకిస్తుందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజా అన్నారు, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు పై కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, ఈ నెల 19వ తేదీన నర్సీపట్నంలో వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో నర్సీపట్నంలో శాంతియుత నిరసన చేపడతామని తెలిపారు.