నంద్యాల అర్బన్: జనకరన వేగవంతంగా పూర్తి చేయాలి: సెన్సెస్ రాష్ట్ర డైరెక్టర్ నివాస్
Nandyal Urban, Nandyal | May 22, 2026
జిల్లాలో జన గణన ప్రక్రియను వేగవంతంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని సెన్సెస్ డైరెక్టర్ నివాస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి జన గణన పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాజకుమారి, డీఆర్వో రామునాయక్ పాల్గొన్నారు.