నంద్యాల అర్బన్: నంద్యాలలో జూలై 19న బహుజన న్యాయభేరి సభ
Nandyal Urban, Nandyal | Jun 25, 2026
నంద్యాలలో జులై 19న నిర్వహించనున్న 'గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి' సభపోస్టర్లను RPS, REF నాయకులు గురువారం విడుదల చేశారు. చట్టసభల్లో BCలకు 44% కోటా సాధన, జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లే ధ్యేయంగా ఈ సభజరుగుతోందన్నారు. రాయలసీమ పరిశ్రమల్లో స్థానిక బహుజనులకే ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ మేధావులు, ఉద్యోగులు తరలిరావాలని కోరారు.