కర్నూలు: గిరి బలిజ పదం తొలగించాలంటూ.. కర్నూల్ లో బలిజ సంఘం ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.5 ను తక్షణమే రద్దు చేసి, దొమ్మర కులం వారికి జోడించిన “గిరి బలిజ” పదాన్ని వెంటనే తొలగించాలని తెలగ కాపు బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూల్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బలిజలను సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని విమర్శించారు. దొమ్మర కులానికి వేరే పేరుతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని, “గిరి బలిజ” అనే పదాన్ని వాడరాదని కోరారు.లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార