బనగానపల్లె: అవుకు మండలంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు,తప్పిన పెను ప్రమాదం
నంద్యాల జిల్లాఅవుకు మండలం గుండ్ల సింగవరం సమీపంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది.అనంతపురం నుంచి బనగానపల్లె వైపు వెళ్తున్న కారు గుండ్ల సింగవరం సమీపంలో గల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పంట కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఇద్దరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారను బయటకు తీసే ప్రయత్నం చేశారు